
జనరల్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడంతో పాటు కరెన్సీ విలువ పడిపోకుండా నిలబెట్టేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం మూడు నెలల పాటు విదేశాల నుంచి కార్ల దిగుమతులను నిరుత్సాహపరచాలని విధానపరంగా నిర్ణయించింది.
ఈ మేరకు విదేశీ కార్లపై అదనంగా 50 శాతం సర్ఛార్జి విధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు, ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న అనూర కుమార దిస్సనాయకే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 30 శాతం కస్టమ్స్ సుంకానికి అదనంగా ఈ సర్ఛార్జి వసూలు చేయనున్నారు. అయితే మోటారు సైకిళ్లు, ఆటోరిక్షాలకు ఈ నిర్ణయం నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!