

ఎఫ్ఎమ్సీజీ రంగంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. సోమవారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు మంగళవారం కూడా అదే ధోరణిలో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే బ్యాంకింగ్ రంగం మాత్రం లాభాలతో ముందంజలో ఉంది. హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడిని పెంచడంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి.
గత సెషన్ ముగింపు స్థాయి 85,439తో పోలిస్తే, మంగళవారం ఉదయం సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమై క్రమంగా మరింత దిగజారింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా నష్టపోయి 85,007 స్థాయికి చేరింది. అనంతరం కొంతమేర కోలుకుని ఉదయం 10 గంటల సమయంలో 130 పాయింట్ల నష్టంతో 85,309 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా ఇదే ధోరణిలో సాగుతూ, ప్రస్తుతం 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 26,237 వద్ద కదలాడుతోంది.
సెన్సెక్స్‌లో నాల్కో, ఐఐఎఫ్ఎల్, హిందాల్కో, ఎమ్‌సీఎక్స్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, ట్రెంట్, రిలయన్స్, డాబర్ ఇండియా, టీఎమ్‌పీవీ, సోనా బీఎల్డబ్ల్యూ వంటి షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 61 పాయింట్లు లాభపడగా, బ్యాంక్ నిఫ్టీ 193 పాయింట్లకు ఎగబాకింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 90.10 వద్ద కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!