ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బలమైన ఆర్థిక పనితీరును నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు తన అనుబంధ సంస్థలతో కలిసి (కన్సాలిడేటెడ్) రూ.1.85 లక్షల కోట్ల ఆదాయంపై రూ.21,317 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం 2024–25 ఇదే కాలంలో నమోదైన రూ.18,853 కోట్లతో పోలిస్తే లాభం 13.06 శాతం పెరిగింది.
అనుబంధ సంస్థల ఫలితాలను పరిగణనలోకి తీసుకోకుండా (స్టాండలోన్) చూసినప్పుడు కూడా ఎస్బీఐ ఈ క్యూ3లో రికార్డు స్థాయిలో రూ.21,028 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఈ కాలంలో బ్యాంకు ఆదాయం రూ.1,40,915 కోట్లుగా ఉండగా, ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.16,891 కోట్ల లాభంతో పోలిస్తే 24.48 శాతం వృద్ధిని సూచిస్తుంది.
క్యూ3లో ఈ మెరుగైన ఫలితాలకు అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి రూ.2,200 కోట్ల ప్రత్యేక డివిడెండ్ అందడం కీలకంగా దోహదపడిందని బ్యాంకు చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.



.webp&w=3840&q=75)

















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!