

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి స్వతంత్ర ప్రాతిపదికన రూ.19,684 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ.18,643 కోట్లతో పోలిస్తే 6 శాతం ఎక్కువ. అయితే బ్యాంకు మొత్తం ఆదాయం రూ.1,43,876 కోట్ల నుంచి రూ.1,40,412 కోట్లకు తగ్గింది.
మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ.1,23,098 కోట్ల వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,19,666 కోట్లుగా ఉంది. బ్యాంకు ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల నిరర్ధక ఆస్తులు 1.82 శాతం నుంచి 1.49 శాతానికి తగ్గగా, నికర నిరర్ధక ఆస్తులు 0.47 శాతం నుంచి 0.39 శాతానికి తగ్గాయి. సమిష్టి ప్రాతిపదికన నికర లాభం రూ.19,600.46 కోట్ల నుంచి రూ.19,648.87 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.1,79,562 కోట్ల నుంచి రూ.1,81,079 కోట్లకు పెరిగింది.
మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్బీఐ స్వతంత్ర నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.80,032 కోట్లకు చేరింది. గత ఏడాది ఇది రూ.70,901 కోట్లుగా ఉంది. అలాగే ఒక్కో షేరు ముఖ విలువ రూ.1పై రూ.17.35 డివిడెండ్‌ను ప్రకటించినట్లు బ్యాంకు వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!