

విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్ (ఎంఆర్ఓ) కోసం సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న యూనిట్ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ యూనిట్‌కు ఇప్పటికే 60 మందికి పైగా నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లను నియమించినట్లు సాఫ్రాన్ వెల్లడించింది. గత ఏడాది నవంబరులో ప్రారంభమైన సాఫ్రాన్ ఎంఆర్ఓ కేంద్రం ఈ ఏడాది వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించనుందని సంస్థ తెలిపింది. సంవత్సరానికి 300 లీప్ ఇంజన్లకు ఎంఆర్ఓ సేవలు అందించే సామర్థ్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రారంభ దశలో ఈ కేంద్రంలో 250 మందికి ఉపాధి లభించనుండగా, పూర్తి స్థాయి సామర్థ్యాన్ని అందుకున్న తర్వాత ఉద్యోగుల సంఖ్య 1,100కి చేరనుంది. ఫ్రాన్స్‌కు చెందిన విమాన ఇంజన్ల తయారీ సంస్థ సాఫ్రాన్ మరియు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న జీఈ ఏరోస్పేస్ కలిసి ఏర్పాటు చేసిన సీఎఫ్ఎమ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ ఎంఆర్ఓ యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రంలో ఎయిర్‌బస్ ఏ320 నియో, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో ఉపయోగించే లీప్ ఇంజన్లకు నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్ సేవలు అందించనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!