
.jpg&w=3840&q=75)
డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరుకుంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి విలువ ఒక్కరోజులోనే 98 పైసలు పడిపోగా, రూ.89.66 వద్ద క్లోజ్ అయింది. 89 రూపాయల మార్క్‌ను రూపాయి తొలిసారిగా అధిగమించడం ఇదే.
2022 ఫిబ్రవరి 24 తర్వాత ఒక్క రోజులో ఇంత భారీ పతనం నమోదవడం ఇదే మొదటిసారి. గత మూడేళ్లలో రూపాయి ఒకే ట్రేడింగ్ సెషన్లో ఈ స్థాయికి పడిపోవడం జరగలేదు. సంవత్సరం కాలంలో రూపాయి మొత్తం 4.6 శాతం మేర బలహీనపడింది. దీంతో రూపాయి ఆసియా ఖండంలో అత్యంత బలహీనపడిన కరెన్సీల్లో ఒకటిగా మారిందని నిపుణులు చెబుతున్నారు.
దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, అంతర్జాతీయ డాలర్ సూచీ బలపడటం రూపాయిపై అదనపు ఒత్తిడిని పెంచాయి. భారత్–ఇరాన్ చమురు వాణిజ్యంపై అమెరికా ఆంక్షలు, టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు కూడా ఈ పడిపోవుకు ప్రధాన కారణాలుగా మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
త్వరలో రూపాయి విలువ 90 మార్క్‌ను కూడా దాటే అవకాశం ఉందని ‘యా వెల్త్’ గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ అనూజ్ గుప్తా అంచనా వేశారు.














.avif&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!