

పసిడి ధరలు భగ్గుమంటున్నాయి రూపాయి బలహీనత ప్రభావం, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా లక్షా 40 వేల మార్క్ కు చేరుకుంది. వారం రోజుల్లోనే బంగారం ధర దాదాపు 4 వేల వరకు పెరిగింది. అయితే.. అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరుగుతుండటంతో దేశీయంగా కూడా పెరుగుతున్నాయని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పలు వెబ్సైట్ల ఆధారంగా బుధవారం (డిసెంబర్ 24 2025) ఉదయం నమోదైన ధరల ప్రకారం దేశీయంగా బంగారం, వెండి రేట్లు
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 మేర పెరిగి...రూ.1,38,930.
22 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.350 మేర పెరిగి...1,27,350.
వెండి కిలో ధర రూ.10 వేల మేర పెరిగి...2,33,000.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు :
హైదరాబాద్ :
బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,930,
22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,27,350,
వెండి కిలో ధర రూ.2,44,000.
విజయవాడ, విశాఖపట్నం :
24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,38,930,
22 క్యారెట్ల ధర రూ.1,27,350,
కిలో వెండి ధర రూ.1,44,000.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!