

భారత్ మార్కెట్‌లో భారీ విస్తరణకు రెనాల్ట్ సిద్ధమవుతోంది. కంపెనీ సీఈఓ ఫ్రాంకోయిస్ ప్రోవోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2030 నాటికి భారత్‌లో ఏడు మోడళ్ల వాహనాల లైనప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కంపెనీ రూపొందించిన విస్తృతమైన “futuREady” వ్యూహంలో భాగం. ఈ ప్రణాళిక ద్వారా దశాబ్దం ముగిసే నాటికి భారత్‌ను రెనాల్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా టాప్-3 కీలక మార్కెట్లలో ఒకటిగా మార్చాలని కంపెనీ భావిస్తోంది. కొత్త లైనప్‌లో పెట్రోల్, హైబ్రిడ్, సిఎన్‌జీ, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నాయి. భారత మార్కెట్‌లో వేగంగా పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త మోడళ్ల విడుదలతో పాటు భారత్‌లో 5 శాతం మార్కెట్ షేర్ సాధించడమే రెనాల్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే భారత్‌ను ఎగుమతులు మరియు టెక్నాలజీ అభివృద్ధికి కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. భవిష్యత్ అమ్మకాలలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వాటా గణనీయంగా ఉండనుందని కంపెనీ అంచనా వేస్తోంది. కొత్త మోడళ్లను తక్కువ ఖర్చుతో తయారు చేయడానికి ఫ్లెక్సిబుల్ ప్లాట్‌ఫారమ్‌లపై అభివృద్ధి చేయనున్నారు. SUVలు, ప్రీమియం కార్లకు పెరుగుతున్న డిమాండ్, పోటీ నేపథ్యంలో భారత్‌లో తన స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు రెనాల్ట్ దూకుడు ప్రణాళికతో ముందుకెళ్తోంది.



_1775900374811.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!