
ఆరోగ్యం

రెనో ఇండియా తన పాపులర్ మిడ్‌సైజ్ ఎస్యూవీ డస్టర్‌ను మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2022లో డస్టర్‌ను ఉపసంహరించుకున్న కంపెనీ, తాజాగా ‘రెనో. రీథింక్’ వ్యూహంలో భాగంగా చెన్నైలో కొత్త తరం డస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త మోడల్‌ను హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో పాటు రెండు కొత్త టర్బో ఇంజిన్ ఎంపికలతో పరిచయం చేసింది. డస్టర్ ధరలను ఈ ఏడాది మార్చిలో వెల్లడించనున్నట్లు రెనో తెలిపింది.
అలాగే ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి టర్బో వేరియంట్ డెలివరీలను ప్రారంభించనుండగా, హైబ్రిడ్ వేరియంట్ల డెలివరీలు దీపావళి నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!