30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

Writer: Pooja 09:33 AM, 30 సెప్టెంబర్, 2026
కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు విజయకుమార్‌ నాయుడు (77) చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం ప్రాంతంలోని బత్తలవల్లం కేంద్రంగా ఆయన స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ అనంతరం ‘ఏకం’గా కొనసాగింది. ధ్యానం, ఆత్మపరిశీలన, అంతర్గత మార్పు, మానసిక ప్రశాంతత వంటి అంశాలపై ఆయన బోధనలు సాగాయి. ఆయన మృతితో భక్తులు, శిష్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భక్తుల దర్శనార్థం ఆయన భౌతిక దేహాన్ని ఏకం క్షేత్రంలో ఉంచనున్నట్లు సమాచారం.

1949లో తమిళనాడులో జన్మించిన విజయకుమార్‌ చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేసి కొంతకాలం ఎల్‌ఐసీలో క్లర్క్‌గా పనిచేశారు. అనంతరం ఆధ్యాత్మికత, ప్రత్యామ్నాయ విద్య వైపు అడుగులు వేశారు. 1980ల మధ్యలో ప్రస్తుత చిత్తూరు జిల్లా పరిధిలోని రాజుపేట సమీపంలో ‘జీవాశ్రమం’ పేరుతో రెసిడెన్షియల్‌ స్కూల్‌ను ప్రారంభించారు. విద్యార్థుల వికాసం, ఆత్మపరిశీలనకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ ప్రాజెక్ట్‌ తరువాత ‘సత్యలోకం’గా ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. 1980ల చివర్లో కల్కి అవతార భావనతో ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించిన ఆయన, భార్య పద్మావతితో కలిసి ‘వన్నెస్‌’ ఉద్యమాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించారు. బత్తలవల్లంలో నిర్మించిన తెల్లటి పాలరాతి వన్నెస్‌ టెంపుల్‌ 2005లో ప్రారంభమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

ట్యాగ్లు
కల్కి భగవాన్విజయకుమార్ నాయుడుఏకంవన్నెస్ఆధ్యాత్మిక గురువుఆధ్యాత్మికత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి  -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూపర్ ఇంటెలిజెన్స్‌పై ట్రంప్‌తో టెక్ దిగ్గజాల భేటీ
జనరల్

సూపర్ ఇంటెలిజెన్స్‌పై ట్రంప్‌తో టెక్ దిగ్గజాల భేటీ

బీపీ ఉన్నవారి ఆహారంలో ఈ పండ్లు ఉండాలంటున్న వైద్యులు
ఆరోగ్యం

బీపీ ఉన్నవారి ఆహారంలో ఈ పండ్లు ఉండాలంటున్న వైద్యులు

ఆర్చరీలో స్వర్ణం కొల్లగొట్టిన చికిత, సాహిల్
క్రీడలు

ఆర్చరీలో స్వర్ణం కొల్లగొట్టిన చికిత, సాహిల్

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జనరల్

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక
బిజినెస్

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జనరల్

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం
జనరల్

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు
రాజకీయాలు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు
బిజినెస్

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?
బిజినెస్

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు
జనరల్

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!