

దేశంలో ధనవంతులు, పెద్ద వ్యాపారవేత్తలు తమ ఆస్తులను ప్రైవేట్ ట్రస్టుల పేరిట ఉంచడం కొత్త విషయం కాదు. ఇళ్లు, భూములు, షేర్లు వంటి ఆస్తులను నేరుగా వ్యక్తిగత పేర్లపై కాకుండా ట్రస్టుల పేర్లపై నమోదు చేయడం ద్వారా కుటుంబ ఆస్తుల నిర్వహణ సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ట్రస్టులో సెట్లర్, ట్రస్టీ, లబ్ధిదారులు అనే మూడు కీలక భాగాలు ఉంటాయి. ఒకసారి ఆస్తి ట్రస్టుకు బదిలీ అయితే చట్టపరంగా ఆ ఆస్తికి యజమాని ట్రస్టే అవుతుంది.
అయితే ట్రస్టులు అప్పుల నుంచి పూర్తిస్థాయి రక్షణ ఇవ్వవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రుణాలు ఎగ్గొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా ఆస్తులను ట్రస్టులకు బదిలీ చేస్తే కోర్టులు దానిని మోసపూరిత చర్యగా పరిగణించే అవకాశం ఉంది. అలాగే ప్రైవేట్ ట్రస్టులకు ప్రత్యేక పన్ను మినహాయింపులు ఉండవు. అక్రమంగా డబ్బు దాచిపెట్టే ప్రయత్నాలు జరిగితే ఈడీ, ఆదాయపు పన్ను శాఖలు దర్యాప్తు చేసి ట్రస్ట్ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉంటాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!