

ఎన్‌టీపీసీ తన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారీ విస్తరణ ప్రణాళికలను రూపొందిస్తోంది. 2037 నాటికి 244 గిగావాట్ల కార్యాచరణ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని సంస్థ ఛైర్మన్ గుర్దీప్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం సంస్థ సామర్థ్యం 91 గిగావాట్లుగా ఉండగా, 2032 నాటికి దానిని 149 గిగావాట్లకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కూడా ఉండనుంది. దేశ ఆర్థిక వ్యవస్థ, జీవన ప్రమాణాలు మెరుగవుతున్న కొద్దీ విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
సంస్థ 50వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, 2036-37 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని విభాగాల్లో కలిపి రూ.16.86 లక్షల కోట్ల మూలధన వ్యయాలు చేపట్టనున్నట్లు గుర్దీప్ సింగ్ వెల్లడించారు. థర్మల్, హైడ్రో, పంప్డ్ స్టోరేజ్, పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ నిల్వలు, గనులు, అణువిద్యుత్ రంగాల్లో ఈ పెట్టుబడులు చేయనున్నారు. వచ్చే దశాబ్దం ఎన్‌టీపీసీ చరిత్రలో కీలకమైన వృద్ధి కాలంగా నిలుస్తుందని, దేశ భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సంస్థ దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!