

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ 16 సిరీస్ ఫోన్ల ధరలను భారత్‌లో పెంచింది. మిడ్ రేంజ్ వేరియంట్ల ధరలను రూ.1000 నుంచి రూ.3000 వరకు పెంచింది. మెమొరీ, చిప్సెట్ మరియు తయారీ ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ ధరల వివరాలను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్‌లో షేర్ చేశారు.
రియల్మీ 16 ప్రో 5జీ ధర రూ.1000 పెరిగింది. అలాగే రియల్మీ 16 ప్రో+ 5జీ మోడల్స్ ధరలు రూ.2000 నుంచి రూ.3000 వరకు పెరిగాయి. రియల్మీ 16 5జీ సిరీస్ ధరలు కూడా ఇదే రేంజ్లో పెరిగాయి. మరోవైపు వన్‌ప్లస్ కూడా తన వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ ధరను రెండోసారి పెంచింది. ఈసారి రూ.4500 వరకు పెంపు జరగగా, బేస్ వేరియంట్ ధర రూ.54,999కి, టాప్ వేరియంట్ రూ.59,999కి చేరింది. విడుదల సమయంలో ఉన్న ధరతో పోలిస్తే ఇప్పటివరకు రూ.7000 వరకు పెరగడం గమనార్హం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!