

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులకు కీలక సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా ఈపీఎఫ్ ఖాతాలోని సొమ్మును నేరుగా బ్యాంకు ఖాతాలోకి ఉపసంహరించుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ సదుపాయాన్ని అందించేందుకు ఈపీఎఫ్ఓ కొత్త మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా ఈపీఎఫ్‌లో ఉన్న సొమ్ములో కొంత భాగాన్ని మినహాయించి, మిగిలిన మెజారిటీ మొత్తాన్ని యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలోకి ఉపసంహరించుకునే వీలును చందాదారులకు కల్పించనున్నారు. కొత్త ఈపీఎఫ్ఓ మొబైల్ యాప్‌లో యూపీఐ ఆధారిత ఉపసంహరణతో పాటు పాస్‌బుక్ బ్యాలెన్స్ వీక్షణ వంటి పలు సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాదు, బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసేందుకు ఎంత మొత్తం అందుబాటులో ఉందో కూడా సభ్యులు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
లావాదేవీలను సురక్షితంగా పూర్తి చేయడానికి చందాదారులు తమ బ్యాంక్ ఖాతాలకు అనుసంధానించిన యూపీఐ పిన్ను వినియోగించాల్సి ఉంటుంది. సేవల నాణ్యతను మెరుగుపరచడం, సాంకేతిక లోపాలను తొలగించడం లక్ష్యంగా ప్రస్తుతం ఈపీఎఫ్ఓ 100 డమ్మీ ఖాతాలతో ట్రయల్ రన్స్ నిర్వహిస్తోంది. ఈ కొత్త మొబైల్ యాప్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు కార్మిక శాఖ సన్నద్ధమవుతోంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!