

కొత్త ఆర్థిక సంవత్సరం 2026–27 ప్రారంభంతో బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలతో పాటు పలు బ్యాంకులు తమ సేవల నియమాలను సవరించాయి.
ఇప్పటివరకు ఏటీఎంలలో యూపీఐ ద్వారా నగదు తీసుకోవడం కొంతవరకు ఉచితంగా ఉండేది. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ సదుపాయాన్ని కూడా నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల్లో భాగంగా పరిగణించనున్నారు. ఉచిత పరిమితి పూర్తయిన తర్వాత యూపీఐ ద్వారా ప్రతి నగదు ఉపసంహరణ పై రూ.23 తో పాటు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
HDFC Bank సహా పలు బ్యాంకులు ఈ మార్పులను అమలు చేయనున్నాయి. ఇక Punjab National Bank కొన్ని డెబిట్ కార్డులపై రోజువారీ ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.50 వేలకి తగ్గించింది. Bandhan Bank ఖాతాదారులు తమ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో 3 లావాదేవీలు మాత్రమే ఉచితం. ఆ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ.10 చార్జీ విధించబడుతుంది.
ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు డిజిటల్ చెల్లింపులకు ఇక పై రెండు స్థాయిల భద్రత (ఓటీపీతో పాటు పిన్ లేదా బయోమెట్రిక్) తప్పనిసరి కానుంది. అలాగే యాప్ల ద్వారా తరచుగా బ్యాలెన్స్ చెక్ చేస్తే స్వల్ప ఛార్జీలు ఉండే అవకాశం ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!