

అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, దేశీయంగా ఐటీ రంగంలో భారీ అమ్మకాల కారణంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు పడిపోయి 76,627 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 24,000 మార్క్‌ను కోల్పోయి 23,949 వద్ద కొనసాగుతోంది. ఉదయం 9:30 గంటలకు ఈ స్థితి కొనసాగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలపడుతూ 94.30 వద్ద ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, సిప్లా, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్లు లాభాల్లో ఉండగా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో షేర్లు తీవ్రంగా పడిపోయాయి.
యాక్సెంచర్ సంస్థ తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడం, భవిష్యత్ డిమాండ్ బలహీనంగా ఉంటుందని సూచించడం వల్ల ఐటీ రంగంపై ఆందోళనలు పెరిగాయి. దీంతో నిఫ్టీ ఐటీ సూచీ 6 శాతం కంటే ఎక్కువ పతనమైంది. ఇన్ఫోసిస్ 7.3 శాతం, టీసీఎస్, టెక్ మహీంద్రా 6 శాతం చొప్పున పడిపోయాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 5.5 శాతం, విప్రో 4 శాతం దిగజారాయి. అమెరికా మార్కెట్లో యాక్సెంచర్ షేర్లు 17 శాతం పడిపోవడం గమనార్హం. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండగా, కోస్పి 2.8 శాతం, నిక్కీ 0.6 శాతం లాభపడగా, ఏఎస్‌ఎక్స్ 0.74 శాతం నష్టపోయింది. అమెరికా మార్కెట్లు గత సెషన్‌లో లాభాల్లో ముగిశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!