

మంగళవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు అదే ఊపును కొనసాగిస్తూ ట్రేడింగ్ ముగిసే సమయానికి బలంగా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 2,072.67 పాయింట్లు (2.54%) పెరిగి 83,739.13 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 639.15 పాయింట్లు (2.55%) లాభపడి 25,727.55 వద్ద ముగిసింది. అన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు ఉత్సాహంగా కొనసాగాయి.
పారామౌంట్ కమ్యూనికేషన్స్, ఫేజ్ త్రీ, అవలోన్ టెక్నాలజీస్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, గర్వారే హై-టెక్ ఫిల్మ్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు పరాస్ పెట్రోఫిల్స్, ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్, TECIL కెమికల్స్ & హైడ్రో పవర్, కామత్ హోటల్స్ (ఇండియా), MPS షేర్లు నష్టాల్లో ముగిశాయి.
మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడానికి ప్రధాన కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం నిలిచింది. ఈ ఒప్పందం ప్రకారం భారత ఉత్పత్తులపై అమెరికా విధించే పరస్పర సుంకాలను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%)తో పోలిస్తే తక్కువ కావడం విశేషం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!