
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎమ్) ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో వేగాన్ని పెంచుకుంది. కేవలం గత ఏడు నెలల్లోనే 30,000 ఈవీ ఎస్‌యూవీలు అమ్మినట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. అంటే ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలక్ట్రిక్ వాహనం విక్రయమవుతోంది.
దేశీయ ఈవీ మార్కెట్లో ఆధిపత్యం సాధించడం లక్ష్యంగా ఎంఅండ్ఎమ్ గత ఏడాది నవంబర్‌లో XEV 9e, BE6 మోడళ్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీటి వార్షికోత్సవ సందర్భంగా కంపెనీ ఆసక్తికర వివరాలు వెల్లడించింది.
కంపెనీ ప్రకారం, మహీంద్రా ఈవీ ఎస్‌యూవీలలో 65% వాహనాలు వర్కింగ్ డేస్‌లో రోడ్లపై యాక్టివ్‌గా పరుగులు తీస్తున్నాయి, ఇది కస్టమర్లు వీటిని ఎంతగా నమ్ముకున్నారో చూపిస్తోంది. ముఖ్యంగా, కొనుగోలు చేసిన 10 మందిలో 8 మంది మొదటిసారి వాహనం కొన్నవారే కావడం విశేషం.
ఇక పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఎంఅండ్ఎమ్ దేశవ్యాప్తంగా ఈవీ వినియోగాన్ని వేగవంతం చేసేందుకు కీలక మౌలిక సదుపాయాల ప్రణాళికను రూపొందించింది. 2027 చివరి నాటికి దేశంలో 180 కిలోవాట్ సామర్థ్యం గల 250 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా 1,000 వరకు ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి.
భారతదేశంలో పెరుగుతున్న ఈవీ డిమాండ్‌కు తగ్గట్టుగా ఆధునిక ఛార్జింగ్ నెట్వర్క్ అవసరమని కంపెనీ తెలిపింది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!