

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ వాణిజ్య విద్యుత్ వాహనాల మార్కెట్లోకి ప్రవేశించింది. గ్రూప్‌నకు చెందిన కమర్షియల్ ఈవీల విభాగం జేఎస్‌డబ్ల్యూ గ్రీన్‌టెక్ మంగళవారం ‘యాంప్‌స్టార్’ పేరుతో కొత్త బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ కింద విద్యుత్ ట్రక్కులు, బస్సులను తయారు చేసి విక్రయించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందుకోసం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో రూ.2,500 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ఏటా 15,000 వాహనాలను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు విద్యుత్ బస్సులను సరఫరా చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఎండీ పార్థ్ జిందాల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన టెండర్లలో పాల్గొంటామని చెప్పారు. విద్యుత్ టిప్పర్లు, డంపర్ల సరఫరా కోసం వేదాంత, అదానీ వంటి ప్రముఖ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!