

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) ఈ నెలలో ప్రారంభించనున్న తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లో ఒక్కో షేరును రూ.1,065–1,119 ధరల శ్రేణిలో ఆఫర్ చేయవచ్చని సమాచారం. ధరల శ్రేణిలో గరిష్ఠ ధరను పరిగణనలోకి తీసుకుంటే కంపెనీ రూ.30,213 కోట్లను సమీకరించే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది. ఇదే జరిగితే, దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా జియో నిలవనుంది.
ఈ ఐపీఓ ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ విలువ సుమారు రూ.10.3 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. దీంతో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, టెలికాం రంగ ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్ తర్వాత దేశంలో మూడో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా జియో అవతరించనుంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15.84 లక్షల కోట్లుగా, ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ.11.27 లక్షల కోట్లుగా నమోదైనట్లు నివేదిక తెలిపింది.
జియో ఐపీఓ ఈ నెల 21న ప్రారంభమై 23న ముగియవచ్చని, ఈ నెల 28న కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కావచ్చని సమాచారం. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ కొత్త ఈక్విటీ షేర్లను మాత్రమే జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వాటాదారులు తమ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించే ఆలోచనలో లేరని సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!