18, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2026 లో ఐటీ నియామకాలు, అనుభవజ్ఞులకే అధిక డిమాండ్

Writer: Krishna Priya 09:39 AM, 23 డిసెంబర్, 2025
2026 లో ఐటీ నియామకాలు,  అనుభవజ్ఞులకే అధిక డిమాండ్

ఈ ఏడాది దేశీయ ఐటీ రంగం మెల్లగా పుంజుకుంటోందని తాజా నివేదిక వెల్లడించింది. 2025లో ఐటీ ఉద్యోగ నియామకాలు 18 లక్షలకు చేరగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 16 శాతం వృద్ధిని సూచిస్తోంది. సోమవారం విడుదలైన ‘ఐటీ వర్క్‌ఫోర్స్‌ ట్రెండ్స్‌ ఇన్‌ ఇండియా 2025’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. టాలెంట్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ క్వెస్‌ కార్ప్‌ మరియు వర్క్‌ఫోర్స్‌ కలిసి ఈ అధ్యయనాన్ని రూపొందించాయి.

భారత ఐటీ నియామకాల్లో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) పాత్ర గణనీయంగా పెరిగింది. 2024 లో 15 శాతంగా ఉన్న జీసీసీ వాటా ఈ ఏడాది 27 శాతానికి చేరింది. ప్రొడక్ట్‌ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ (సాస్‌) సంస్థల్లో ఎంపిక చేసిన విభాగాల్లో హైరింగ్‌ పెరిగినప్పటికీ, ఐటీ సేవలు మరియు కన్సల్టింగ్‌ రంగంలో స్వల్ప వృద్ధి మాత్రమే కనిపించింది. మరోవైపు, ఫండింగ్‌ తగ్గడంతో స్టార్ట్‌ప్‌ సంస్థల నియామక వృద్ధి ఏక అంకె స్థాయికే పరిమితమైంది. ఫ్రెషర్లతో పోలిస్తే అనుభవజ్ఞులకే ఈ ఏడాది అధిక డిమాండ్‌ నెలకొంది. మొత్తం నియామకాల్లో 4 నుంచి 10 సంవత్సరాల అనుభవం కలిగిన వారి వాటా 65 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇది 50 శాతంగా ఉండటం గమనించదగినది. 2025 లో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగుల హైరింగ్‌ వాటా 15 శాతంగా ఉండగా, కాంట్రాక్టు ఉద్యోగుల వాటా 10–11 శాతంగా ఉంది.

కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి డిజిటల్‌ నైపుణ్యాలకు కంపెనీల నుంచి బలమైన డిమాండ్‌ కనిపిస్తోంది. 2026లోనూ ఐటీ ఉద్యోగ నియామకాల వేగం కొనసాగనుందని నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా హైరింగ్‌ విస్తరించనుందని, ఏఐ, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా స్పెషలిస్టు విభాగాలపై డిమాండ్‌ కేంద్రీకృతమవుతుందని తెలిపింది. బీఎఫ్‌ఎస్‌ఐ, సాస్‌, టెలికాం, మ్యాన్యుఫాక్చరింగ్ రంగాల్లో ఐటీ నిపుణుల అవసరం మరింత పెరగనుంది. వచ్చే ఏడాది మానవ వనరుల విస్తరణ కంటే సామర్థ్య ఆధారిత వృద్ధిపై కంపెనీలు ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు నివేదిక పేర్కొంది.

ఇదే సమయంలో, ఉద్యోగ అర్జీల సంఖ్యలోనూ భారీ పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది జాబ్‌ అప్లికేషన్లు 9 కోట్లను దాటగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 29 శాతం అధికం. జాబ్‌ పోర్టల్‌ అప్నా.కో విడుదల చేసిన ‘ఇండియా ఎట్‌ వర్క్‌ 2025’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మహిళలు మరియు ఫ్రెషర్ల నుంచి అప్లికేషన్లు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. 2024 తో పోలిస్తే మహిళల నుంచి ఉద్యోగ అర్జీలు 36 శాతం పెరిగాయని, ముఖ్యంగా ఫైనాన్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌, కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌, హెల్త్‌కేర్‌ సపోర్ట్‌ ఉద్యోగాలకు వీరి నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది. ఫ్రెషర్ల అప్లికేషన్లు కూడా వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జియో శాటిలైట్ ఇంటర్నెట్‌కు గ్రీన్ సిగ్నల్

జియో శాటిలైట్ ఇంటర్నెట్‌కు గ్రీన్ సిగ్నల్

వినియోగదారుల కమిషన్ తీర్పుపై మారుతి స్పందన

వినియోగదారుల కమిషన్ తీర్పుపై మారుతి స్పందన

గోల్డ్ రేట్లు డౌన్...వెండి ధర ఎంత ఉందో తెలుసా?

గోల్డ్ రేట్లు డౌన్...వెండి ధర ఎంత ఉందో తెలుసా?

హెరిటేజ్ ఫుడ్స్ క్యూ1లో ఆదాయ వృద్ధి

హెరిటేజ్ ఫుడ్స్ క్యూ1లో ఆదాయ వృద్ధి

టెక్ మహీంద్రా లాభాల జోరు

టెక్ మహీంద్రా లాభాల జోరు

విప్రో నుంచి ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..

విప్రో నుంచి ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..

ట్యాగ్లు
ఐటీ రంగంఐటీ ఉద్యోగాలుఐటీ నియామకాలుఉద్యోగ అవకాశాలుఅనుభవజ్ఞుల డిమాండ్ఫ్రెషర్ ఉద్యోగాలుకృత్రిమ మేధక్లౌడ్ కంప్యూటింగ్సైబర్ సెక్యూరిటీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డ్యాన్సర్ల బకాయిలపై చాంబర్‌కు లేఖ
సినిమాలు

డ్యాన్సర్ల బకాయిలపై చాంబర్‌కు లేఖ

మీనాక్షి నామినేషన్‌పై సీఈసీ క్లారిటీ
రాజకీయాలు

మీనాక్షి నామినేషన్‌పై సీఈసీ క్లారిటీ

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’
సినిమాలు

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు
క్రీడలు

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి
రాజకీయాలు

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన
జనరల్

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
జనరల్

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష
జనరల్

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’
సినిమాలు

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు
సినిమాలు

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!