

భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు దిల్లీలో జరుగనున్నాయి. మొదటి విడత ఒప్పందంపై దృష్టి సారించడానికి ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. అమెరికా తరఫున డిప్యూటీ యూఎస్టీఆర్ రిక్ స్విట్జర్ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, భారత ఎగుమతులపై 50% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. గత సెప్టెంబరులో రెండు దేశాలు చర్చలు జరిపాయి. ఇటీవల వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ ఏడాదిలోనే మొదటి దశ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు.
ఇరు దేశాలు సుంకాల సమస్య, టారిఫ్లు, వాణిజ్య అవరోధాలు వంటి అంశాలపై చర్చించనున్నాయి. 2025 డిసెంబరు నాటికి వాణిజ్య చర్చలు పూర్తిచేయాలని భారత్–అమెరికాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటి వరకు ఆరుసార్లు చర్చలు జరగ్గా, ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం 191 బిలియన్ డాలర్లు గా ఉంది. దీన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!