
.webp&w=3840&q=75)
వచ్చే ఏడాదిలోనూ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని, అంచనాలకు మించి వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ పెట్టుబడుల బ్యాంకు Goldman Sachs వెల్లడించింది.
బుధవారం విడుదల చేసిన నివేదికలో దేశీయ డిమాండ్ బలంగా ఉండటం, రహదారులు మరియు మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం స్థిరంగా కొనసాగడం, చైనా వంటి దేశాలతో పోలిస్తే ఎగుమతులపై భారత్ తక్కువగా ఆధారపడటం వంటి అంశాలు దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో 2026లో భారత ఆర్థిక వ్యవస్థ 6.7 శాతం, 2027లో 6.8 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది.
ఈ వృద్ధి రేట్లతో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని నివేదిక పేర్కొంది. అలాగే, 2026 చివరి నాటికి చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం నెమ్మదించే అవకాశముందని, దీని వల్ల కేంద్ర బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను కొనసాగించేందుకు వీలు కలుగుతుందని తెలిపింది.
అయితే, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగ కల్పన నెమ్మదిస్తోందని గోల్డ్‌మన్ సాక్స్ హెచ్చరించింది. అయినప్పటికీ, స్థిరమైన వృద్ధి మరియు సానుకూల ఆర్థిక పరిస్థితుల కారణంగా భారత్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆశాకిరణంగా పేర్కొంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!