

భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ లాభాల దారిలో పయనించింది. గురువారం జరిగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 52 వారాల గరిష్ఠాలను తాకి పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించాయి. చివరికి సెన్సెక్స్ 446.21 పాయింట్లు పెరిగి 85,632.68 వద్ద ముగియగా, నిఫ్టీ 139.50 పాయింట్ల లాభంతో 26,192.15 వద్ద క్లోజ్ అయింది.
ఆయిల్ & గ్యాస్ సంస్థల షేర్లు, కొందరు ఎంపిక చేసిన ఫైనాన్షియల్ కంపెనీలలో కొనుగోళ్లు మార్కెట్‌కు బలమైన మద్దతు అందించాయి. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) తిరిగి కొనుగోళ్లకు దిగడం, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ కావడం కూడా మార్కెట్ ర్యాలీకి దోహదం చేశాయి.
టెక్నికల్ విశ్లేషకుల అంచనా ప్రకారం, పెద్ద అవాంతరాలు ఏవీ రాకపోతే ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 91,500 పాయింట్లు చేరే అవకాశం ఉంది.
రిలయన్స్ షేరు గురువారం బలమైన పెరుగుదల కనబరిచింది. బీఎస్ఈలో ఒక దశలో 2.42% లాభంతో ₹1,550.90ను తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రికార్డ్ స్థాయిగా ₹21 లక్షల కోట్లు చేరింది. చివరి ట్రేడింగ్‌లో షేరు 2.01% పెరిగి ₹1,549.10 వద్ద ముగియగా, మొత్తం మార్కెట్ విలువ ₹20.96 లక్షల కోట్లుగా నమోదైంది.
పవర్ మెక్ ప్రాజెక్ట్స్ తన రుణ సేకరణ పరిమితిని ప్రస్తుత ₹5,000 కోట్లు నుంచి ₹7,500 కోట్లుకి పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వాటాదారుల ఆమోదం కోసం కంపెనీ ఈ-ఓటింగ్‌ను ప్రారంభించింది. వాటాదారులు తమ ఓటును నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20 వరకు నమోదు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!