

రాబోయే 20 నుంచి 30 ఏళ్లలో భారతదేశం 25 నుంచి 30 ట్రిలియన్ డాలర్ల మహా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సత్తా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో జరిగిన "ఇన్వెస్టింగ్ ఫర్ ఎ న్యూ ఎరా" (Investing for a New Era) కార్యక్రమంలో బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భారతదేశ ఆర్థిక ప్రస్థానంపై ఆయన ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. భారతీయులు సంప్రదాయబద్ధంగా పొదుపు చేసేవారని, అయితే ఇప్పుడు ఆ పొదుపును పెట్టుబడిగా మార్చాల్సిన సమయం వచ్చిందని అంబానీ పిలుపునిచ్చారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల కుటుంబాల సంపద పెరగడమే కాకుండా, దేశ ఆర్థిక వృద్ధి కూడా వేగవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఏఐ సాంకేతికత ద్వారా విద్య, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని అంబానీ చెప్పారు. దీనివల్ల 140 కోట్ల మంది భారతీయులకు నాణ్యమైన సేవలు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయని వివరించారు. బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్ మాట్లాడుతూ.. రాబోయే 20-25 ఏళ్లు ఖచ్చితంగా "భారతదేశ యుగం" అని అభివర్ణించారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక సురక్షితమైన మరియు లాభదాయకమైన కేంద్రమని ఆయన కొనియాడారు: స్థిరమైన రాజకీయం, బలమైన విధానాలు, 5G డిజిటల్ విప్లవం మరియు భారీ మౌలిక సదుపాయాల కల్పన వల్ల భారత్ అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని అంబానీ తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!