

భారతదేశం ప్రస్తుతం సూపర్ పవర్ కాదని, అలా భావించడం పరిణతి లేని ఆలోచనకు నిదర్శనమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. అయితే, ఆ లక్ష్యాన్ని ఆశించడం తప్పుకాదని, కానీ ఆ స్థాయికి చేరుకోవడానికి ఇంకా కొన్ని దశాబ్దాలు పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎంటర్ప్రెన్యూర్ కుశాల్ లోధా పాడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన, ముందుగా జాతి నిర్మాణంపై దృష్టి పెట్టడం అత్యవసరమన్నారు.
రాబోయే 30 సంవత్సరాల్లో దేశ ప్రజలందరూ కష్టపడి పనిచేస్తేనే భారతదేశం ఆ లక్ష్యాన్ని చేరుకోగలదని చెప్పారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఆర్థిక వృద్ధిని చూసి నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని హెచ్చరించారు. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, నాణ్యమైన విద్య, ఉత్పాదకత వంటి రంగాల్లో మనం ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు.
ప్రస్తుత వృద్ధి గణాంకాలను చూసి భారతదేశం ఇప్పటికే ఆర్థికంగా బలంగా మారిందని భావించడం సరైనది కాదని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక, స్థిరమైన అభివృద్ధి కోసం మరింత ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!