

భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారులు (FPI) మళ్లీ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. నవంబర్ 2 నుంచి 13 వరకు జరిగిన తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో నికరంగా రూ.84,290 కోట్ల పెట్టుబడులు పెట్టారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుసగా రెండు నెలల పాటు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు తిరిగి భారత మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం మళ్లీ పుంజుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, లార్జ్ క్యాప్ షేర్ల విలువలు ఆకర్షణీయంగా ఉండటం, ప్రపంచ పెట్టుబడి ధోరణుల్లో మార్పులు విదేశీ పెట్టుబడుల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, టెలికాం, ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లలో విదేశీ ఇన్వెస్టర్లు గణనీయమైన పెట్టుబడులు పెట్టారు. ఈ పరిణామం భారత ఈక్విటీ మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి తిరిగి పెరుగుతున్నట్లు సూచిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!