

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 25 విభిన్న రంగాలకు సంబంధించి 25 ప్రత్యేక పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పార్కుల ద్వారా రూ.3.87 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సుమారు 4.47 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఒకే చోట అందించడం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే కొన్ని పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సమకూర్చేందుకు భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రత్యేక రంగాలకు అనుగుణంగా పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించడంతో పాటు తయారీ రంగాన్ని బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి, భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు దోహదపడనున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!