దేశంలో జీఎస్టీ వసూళ్లలో వృద్ధి ధోరణి కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1.83 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 8.1 శాతం పెరుగుదలగా నమోదైంది. దిగుమతులు మరియు దేశీయ అమ్మకాల పెరుగుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
దేశీయ లావాదేవీలపై వసూలైన జీఎస్టీ రూ.1.36 లక్షల కోట్లకు చేరి, గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 5.3 శాతం వృద్ధి నమోదు చేసింది. అదే సమయంలో దిగుమతులపై వసూలైన పన్నులు 17.2 శాతం పెరిగి రూ.47,837 కోట్లకు చేరాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో చురుకుదనాన్ని సూచిస్తోంది.
ఇక జీఎస్టీ రిఫండ్లు 10.2 శాతం పెరిగి రూ.22,595 కోట్లకు చేరాయి. రిఫండ్లను సమన్వయం చేసిన తర్వాత ఫిబ్రవరి నెలలో నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.61 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!