

అమన్ మసూద్ బిగ్ బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టాడు. హోస్ట్ నాగార్జున్ అతడిని స్టేజ్‌పైకి ఆహ్వానించి, ఆడియెన్స్ ఓట్ల ద్వారా అమన్ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాడని తెలిపారు. ఎంట్రీ సందర్భంగా నాగార్జున్ అమన్‌కు రంధ్రాలు ఉన్న టీషర్ట్‌ను ఇచ్చి అందులో ఎన్ని హోల్స్ ఉన్నాయో చెప్పాలని టాస్క్ ఇచ్చారు. అగ్ని పరీక్షలోనూ ఇలాంటి టాస్క్‌నే అమన్ ఎదుర్కొన్నాడు. అప్పట్లో టీషర్ట్ బొమ్మలోని రంధ్రాలను సరిగ్గా లెక్కించలేకపోయాడు. అదే విషయాన్ని గుర్తుచేస్తూ నాగార్జున్ ఈసారి కూడా సరదాగా టాస్క్ ఇచ్చారు. వచ్చే వీకెండ్‌కి తాను వచ్చినప్పుడు టీషర్ట్‌ను ధరించి ఎన్ని హోల్స్ ఉన్నాయో చెప్పాలని సూచించారు. అలాగే అమన్‌కు రెడ్ డాట్ ఇచ్చి, తన తర్వాత హౌస్‌లోకి వచ్చే ముగ్గురిలో ఒకరికి దానిని ఇవ్వాల్సిన అవకాశాన్ని కల్పించారు.
హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత అమన్ తన ఆటను మొదలుపెడతానంటూ ధీమాగా మాట్లాడాడు. అగ్ని పరీక్షలో తన ఆట, జెన్యూనిటీని చూసే ప్రేక్షకులు తనకు ఓట్లు వేసి బిగ్ బాస్‌లోకి పంపించారని చెప్పాడు. అయితే అగ్ని పరీక్షలో అమన్ పెద్దగా రాణించలేదనే చర్చ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇదే సమయంలో అమన్‌కు నటుడు సోహెల్‌తో బంధుత్వం ఉందని, ఆయన మద్దతుతోనే బిగ్ బాస్‌లోకి ఎంట్రీ దక్కిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వాదనలకు అధికారిక ధృవీకరణ లేదు. బిగ్ బాస్ హౌస్‌లో అమన్ ఆట తీరు ఎలా ఉంటుందన్నది ఇకపై ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!