

భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం, వెండిపై డిమాండ్ మరింత పెరుగుతోంది. గత వారం భారీగా పెరిగిన ధరలు, ఈ వారం కూడా పైకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,580 గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,580 గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా ఇవే ధరలు ఉన్నట్లు తెలుస్తోంది (Gold, Silver Prices on Jan 19).
ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3,01,000 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా దాదాపు ఇదే స్థాయిలో వెండి ధర కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీలో మాత్రం కిలో వెండి అత్యల్పంగా రూ.2,94,900 వద్ద ట్రేడవుతోంది. ఈ వారం బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వెండి ధరలు స్వల్ప దిద్దుబాటుకు లోనయ్యే అవకాశముందని, అది తాత్కాలికమేనని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావంతో రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరగడం తప్పదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గమనిక: బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ ఆధారంగా తరచూ మారుతుంటాయి. కొనుగోలు లేదా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు తాజా ధరలను మరోసారి పరిశీలించడం మంచిది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!