

పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడుల విషయానికి వస్తే బంగారం భారతీయుల తొలి ఎంపికగా నిలుస్తోంది. వెండితో పాటు బంగారానికి కూడా ఎప్పటికప్పుడు డిమాండ్ కొనసాగుతోంది. అందువల్ల హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను తెలుసుకుని కొనుగోలు చేయడం అవసరం. బంగారం స్వచ్ఛతను క్యారట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది కాగా, 22 క్యారెట్ల (916) బంగారం ప్రధానంగా ఆభరణాల తయారీలో వినియోగిస్తారు.
అంతర్జాతీయ మార్కెట్ ధరలు, డాలర్ మారకపు విలువ దేశీయంగా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో పన్నులు కలపకుండా ధరలు ప్రకటించే అవకాశం ఉండటంతో కొనుగోలు సమయంలో పూర్తి బిల్లును పరిశీలించడం అవసరం. బిల్లు లేకుండా బంగారం కొనుగోలు చేస్తే నాణ్యత, మరమ్మతులు, వారంటీ వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల వినియోగదారులు తప్పనిసరిగా అధికారిక బిల్లుతోనే బంగారం కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!