

భారత్లో గత వారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మేలిమి బంగారం ధర దాదాపు రూ.15 వేల వరకు పెరిగితే, వెండి ధరలు సుమారు రూ.40 వేల వరకు ఎగబాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానంతో పెరుగుతున్న భౌగోళిక అనిశ్చితులు, అలాగే ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం వల్ల బంగారం, వెండిపై డిమాండ్ మరింత పెరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ వారం కూడా ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,250కు చేరింది. 22 క్యారెట్ ఆభరణ బంగారం ధర రూ.1,46,890గా నమోదైంది. అలాగే కిలో వెండి ధర రూ.3,64,900 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో మేలిమి బంగారం ధర తొలిసారిగా 5 వేల డాలర్ల మార్కును దాటింది. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 5,065 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, ఔన్స్ వెండి ధర కూడా రికార్డు స్థాయిలో 107 డాలర్లకు చేరింది. డాలర్ బలహీనతతో పాటు మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఈ వారం కూడా బంగారం, వెండి ధరలను మరింత పైకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా పరిశీలించాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!