
న్యూస్

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ₹2,240 పెరిగి ₹1,58,840 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ₹2,050 పెరిగి ₹1,45,560 గా నమోదైంది. బులియన్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ కొనసాగుతుండటం దీనికి కారణంగా తెలుస్తోంది.
ఇక వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. కిలో వెండి ధరపై ₹15,000 పెరిగి ₹3 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, పెట్టుబడిదారుల భద్ర పెట్టుబడులపై ఆసక్తి పెరగడం వల్ల ఈ ధరల పెరుగుదల చోటు చేసుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!