

నిన్న భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర సుమారు రూ.5,400 మేర పెరిగి దాదాపు రూ.1.60 లక్షల స్థాయికి చేరింది. అలాగే వెండి ధర కూడా ఏకంగా రూ.20 వేల వరకు పెరిగి రూ.3.60 లక్షలకు చేరింది. నేడు ఉదయం 11 గంటల సమయంలో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710 గా నమోదైంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,400 వద్ద కొనసాగుతోంది.
వెండి ధర కూడా నేడు అనూహ్యంగా ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3.60 లక్షల స్థాయిలో ట్రేడవుతోంది. డాలర్ బలహీనత, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు కొత్త చైర్మన్ నియామకం నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో బంగారం, వెండి ధరలు మళ్లీ మిన్నంటుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గమనిక: బంగారం, వెండి ధరలు తరచూ మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!