

ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా రాబోయే రోజుల్లో పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.2 లక్షలు దాటే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ.4 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ రోజు ఉదయం 11:30 గంటల సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,73,080కు చేరుకుంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది రూ.4,300కు పైగా పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,58,650గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,73,230 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,58,800గా నమోదైంది.
వెండి ధర కూడా గణనీయంగా పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3.25 లక్షలుగా ఉండగా, ఢిల్లీలో అది రూ.2.95 లక్షలుగా ఉంది. ప్రపంచ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపడంతో ధరలు పెరుగుతున్నాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!