

బంగారం, వెండి ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతుండటంతో పసిడి, వెండికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీని ప్రభావంతో దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
ఈ రోజు (జనవరి 28) ఉదయం హైదరాబాద్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,69,500 కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,950 గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 3,77,600 కు చేరింది. గత కొన్ని రోజులుగా వెండి ధరలు వరుసగా పెరుగుతుండటం గమనార్హం.
నిపుణుల మాట ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ కదలికలు, కేంద్ర బ్యాంకుల పాలసీలు, భౌగోళిక రాజకీయ పరిణామాలే బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా తరచూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!