
.jpg&w=3840&q=75)
గత ఏడాది బంగారం, వెండి మదుపరులకు భారీ లాభాలు అందాయి. పసిడి పెట్టుబడులు సుమారు 73.45 శాతం, వెండి పెట్టుబడులు 164 శాతం రాబడిని ఇచ్చాయి. తాజాగా వెనెజువెలా పై అమెరికా చర్యల నేపథ్యంలో బంగారం, వెండి, చమురు ధరల పై ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది.
మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం తక్షణంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. అయితే అనిశ్చితి కారణంగా బంగారం, వెండి ధరలు స్వల్ప లాభాలతోనే ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ మారకం విలువ, వడ్డీ రేట్లే భవిష్యత్ ధరలను ప్రభావితం చేయనున్నాయి.
వెండి ధరలు ఇటీవల కొద్దిగా తగ్గినప్పటికీ మళ్లీ పుంజుకుంటున్నాయి. పెరుగుతున్న పారిశ్రామిక వినియోగం, చైనా ఆంక్షలు ఇందుకు కారణం. ఈ ఏడాది చివరికల్లా బంగారం ఔన్స్‌కు 5,400 డాలర్లు, వెండి 100 డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!