
టెక్నాలజీ

అమెరికా సంస్థ జీఈ వెర్నోవా ఆంధ్రప్రదేశ్‌లోని ఎగువ సీలేరు జలవిద్యుత్ కేంద్రం కోసం 9 పంప్డ్ స్టోరేజ్ యూనిట్లను సరఫరా చేయడానికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నుంచి ఆర్డర్ పొందినట్లు ప్రకటించింది. ప్రతి యూనిట్ 150 మెగావాట్ల సామర్థ్యంతో ఉండనుండగా, మొత్తం 1.35 గిగావాట్ల సామర్థ్యంతో ఇది దేశంలోనే అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది.
ఈ ప్రాజెక్టు 2030 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. డిజైన్, తయారీ, టెస్టింగ్, సరఫరా, రవాణా, నియంత్రణ, నిర్వహణ వంటి బాధ్యతలను జీఈ వెర్నోవా చేపట్టనుంది. ఇప్పటికే కుందా జలవిద్యుత్ ప్రాజెక్టుకు కూడా నాలుగు 125 మెగావాట్ల యూనిట్లను సరఫరా చేస్తోంది. ఈ ప్రాజెక్టులు విద్యుత్ గ్రిడ్ స్థిరీకరణకు, పునరుత్పాదక ఇంధన సమతుల్యతకు కీలకంగా మారనున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!