

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కంపెనీ ఏజీఎంలో భారత భవిష్యత్తును మార్చే రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. న్యూక్లియర్ పవర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మౌలిక సదుపాయాలు అనే మూడు ప్రధాన స్తంభాలపై కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే గ్రూప్ ఆదాయం 7.4 శాతం పెరిగి రూ.2.92 లక్షల కోట్లకు చేరగా, లాభం 14 శాతం పెరిగి రూ.46,376 కోట్లకు చేరినట్లు వెల్లడించారు.
గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వివాదాలు, ఆరోపణల మధ్య కూడా కంపెనీ మరింత బలంగా నిలిచిందని అదానీ చెప్పారు. అణుశక్తి రంగంలో “అదానీ అటామిక్ ఎనర్జీ” ద్వారా ప్రవేశించి 2035 నాటికి 10 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రకటించారు. డేటా సెంటర్లు, పవర్ ప్రాజెక్టులు, పోర్టులు, విమానాశ్రయాలు, డిఫెన్స్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. భారత్ భవిష్యత్తు వృద్ధికి తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!