
టెక్నాలజీ

మధ్యప్రదేశ్లోని ఒక మారుమూల పల్లెలో పుట్టి, మాతృభాషలోనే చదువుకున్న సాధారణ యువకుడు లలిత్ కేశ్రే ఇప్పుడు ₹9,960 కోట్లకు అధిపతిగా ఎదిగారు. ‘Groww’ సంస్థ సీఈఓగా ఉన్న ఆయన తాజాగా బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించారు.
IIT బాంబేలో చదివిన లలిత్ కేశ్రే, ముగ్గురు భాగస్వాములతో కలిసి 2016లో గ్రోను స్థాపించారు. వేగంగా పెరిగిన ఈ ఫిన్టెక్ కంపెనీ FY2025లో ₹4,056 కోట్ల ఆదాయంతో పాటు ₹1,824 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
ఇటీవల మార్కెట్లో లిస్ట్ అయిన గ్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹1.05 లక్షల కోట్లకు చేరింది. ఇందులో 55.91 కోట్ల షేర్లు లలిత్ కేశ్రేకు చెందినవే.




















కామెంట్స్ (1)
గ్రోతో లలిత్ కేశ్రే సాధించిన విజయం నిజంగా ప్రేరణ