
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో రేపు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి రానుంది. మూడు దశల్లో 2028 నాటికి ప్లాంట్ పూర్తి కానుంది. ఈ యూనిట్ ద్వారా సుమారు మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఆధునిక సాంకేతికతతో ఏర్పడనున్న ఈ ప్లాంట్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడనుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!