

కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)తో పాటు మరో నాలుగు చిన్న, మధ్యస్థాయి సంస్థలు (ఎస్ఎంఈ) ఈ వారం ఐపీఓల ద్వారా మార్కెట్లోకి రానున్నాయి.
బీసీసీఎల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 9 నుంచి 13 వరకు జరగనుంది. ధరల శ్రేణి, లాట్ సైజు, ఇష్యూ నిర్మాణం వంటి వివరాలను సోమవారం వెల్లడించనున్నారు. ఎస్ఎంఈ విభాగానికి చెందిన ఐపీఓలలో ముందుగా గాబియన్ టెక్నాలజీస్ ఇష్యూ రాబోతోంది. ఇది జనవరి 6 నుంచి 8 వరకు కొనసాగనుంది. రూ.76 నుంచి రూ.81 ధరల శ్రేణిలో 36 లక్షల షేర్లను విక్రయించి, రూ.29.16 కోట్లు సమీకరించనుంది.
దీని తరువాత విక్టరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంటర్నేషనల్ మరియు యజుర్ ఫైబర్స్ ఐపీఓలు జనవరి 7 నుంచి 9 వరకు అందుబాటులోకి రానున్నాయి. విక్టరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక్కో షేర్‌ను రూ.41 ధరకు విక్రయిస్తూ 84.3 లక్షల షేర్ల ద్వారా రూ.34.56 కోట్లు సమీకరించనుంది. యజుర్ ఫైబర్స్ రూ.168 నుంచి రూ.174 ధరల శ్రేణిలో 69.2 లక్షల షేర్లను విక్రయించి రూ.120.4 కోట్లు సమీకరించనుంది. అలాగే, రబ్బర్ విడిభాగాలు తయారు చేసే డిఫ్రెయిల్ టెక్నాలజీస్ ఐపీఓ ఈ నెల 9 నుంచి 13 వరకు జరగనుంది. ఇది 18.6 లక్షల షేర్లను విక్రయించనుండగా, ధరల శ్రేణిని ఇంకా ప్రకటించలేదు.





.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!