

భూమి వెంచర్స్ సీఈవో, వేదాంత గ్రూప్ మాజీ సీఈవో సునీల్ దగ్గల్ మాట్లాడుతూ, ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, వనరుల నియంత్రణ భవిష్యత్ ఆర్థిక ఆధిపత్యానికి కీలకమని పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉండి, తన అవసరాల్లో 88–89 శాతం దిగుమతులపై ఆధారపడుతోందని చెప్పారు. అలాగే గ్యాస్ అవసరాల్లో సగం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్న నేపథ్యంలో, దేశ దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వానికి ఇంధన భద్రత అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా–ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు వంటి జియోపాలిటికల్ పరిణామాలు ప్రపంచ ఇంధన సమీకరణాలను మార్చేశాయని దగ్గల్ చెప్పారు. హార్మూజ్ జలసంధి ద్వారా భారత ముడి చమురు దిగుమతుల్లో 45 శాతం వస్తున్నందున పశ్చిమాసియాలో స్థిరత్వం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి కీలక ఖనిజాల నియంత్రణ భవిష్యత్ ప్రపంచ శక్తి సమీకరణాలను నిర్ణయిస్తుందని చెప్పారు. భారత్ విదేశీ సరఫరాలపై ఆధారపడకుండా, మైనింగ్, లోహాలు, మౌలిక సదుపాయాలను వ్యూహాత్మక ఆర్థిక రంగాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!