

వచ్చే ఏడాది నుంచి వివిధ కార్లతో పాటు ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాల ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు తయారీదారులు ధరల పెంపుపై ప్రకటనలు చేయగా, మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3,000 వరకు ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. ముడి సరుకుల ధరలు పెరగడం, అంతర్జాతీయంగా కీలక ఎలక్ట్రానిక్ భాగాల ధరలు పెరగడం, ఫారెక్స్ ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు భిన్నంగా ఉంటుందని తెలిపింది.
అదే సమయంలో డిసెంబర్ స్కీమ్‌లో భాగంగా ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో ఏథర్ స్కూటర్ కొనుగోలుపై రూ.20,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఏథర్ 450 సిరీస్‌లో పెర్ఫార్మెన్స్ స్కూటర్లు, రిజ్తా పేరిట ఫ్యామిలీ స్కూటర్లు మార్కెట్లో ఉన్నాయి. ఈ స్కూటర్ల ధరలు రూ.1,14,546 నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.1,82,946 వరకు ఉన్నాయి.





.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!