
క్రీడలు

ఎస్బీఐ అధ్యయన విభాగం తాజా నివేదిక ప్రకారం దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో 6.6 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. అయితే రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వంటి కారణాలు ఆర్థిక స్థిరత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది.
రూపాయి ఇటీవల డాలర్‌తో పోలిస్తే 95 స్థాయి కంటే దిగువకు పడిపోవడం గమనార్హం. అదే సమయంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటడంతో రవాణా, బీమా ఖర్చులు భారీగా పెరిగాయని నివేదిక తెలిపింది.
ఈ పరిస్థితుల్లో బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ (బీవోపీ) మరియు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (క్యాడ్)కు సంబంధించి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అవసరమని ఎస్బీఐ సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!