
ఓటిటి

యుద్ధ భయాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ప్రారంభంలో గణనీయంగా పెరిగాయి. అయితే రాత్రి సమయానికి కొంతమేర తగ్గుదల నమోదైంది. రాత్రి 11.55 గంటల సమయంలో ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 19 డాలర్లు పెరిగి 5,297 డాలర్ల వద్ద నిలిచింది. అదే సమయంలో ఔన్సు వెండి ధర 5 డాలర్లు తగ్గి 88 డాలర్లకు పరిమితమైంది.
ఈ మార్పుల ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,940గా, కిలో వెండి ధర రూ.2,82,788గా స్థిరపడింది.
గమనిక: పై ధరలు పాఠకుల అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతుంటాయి. నగరం, జ్యువెలర్ లేదా తయారీదారుడి ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు వ్యాపారులను సంప్రదించడం మంచిది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!