

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్‌పై కూడా పడుతోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడంతో దేశీయ ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు రోజుకు రూ.1600 నుంచి రూ.1700 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు సమాచారం. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు పాత ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తుండటంతో గత 10 వారాల్లోనే దాదాపు రూ.1 లక్ష కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదనే వాదనలు బలపడుతున్నాయి. క్రూడాయిల్ కొనుగోళ్ల కోసం కంపెనీలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ధరల పెంపుపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు దేశాలు ఇంధన ధరలను పెంచిన నేపథ్యంలో భారత్‌లో కూడా త్వరలో పెట్రో షాక్ ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!