ఎగుమతిదారులకు మద్దతు అందించే పథకం కింద పన్ను రాయితీలను తగ్గించినప్పటికీ, ఆ తగ్గింపులు వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులకు వర్తించవని కేంద్ర ప్రభుత్వం నిన్న స్పష్టం చేసింది. ‘రిమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ టాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్’ (ఆర్ఓడీటీఈపీ) పథకం ద్వారా వస్తువుల తయారీ, రవాణా మరియు పంపిణీ ప్రక్రియలో ఎగుమతిదారులు చెల్లించిన సుంకాలను తిరిగి చెల్లిస్తారు. ఈ పథకం కింద అమల్లో ఉన్న రేట్లను సగానికి తగ్గిస్తూ తక్షణమే అమలు చేయనున్నట్లు సోమవారం డీజీఎఫ్టీ ప్రకటించింది.
అయితే ఈ తగ్గింపు రేట్లు ఐటీసీ హెచ్ఎస్ కోడ్ చాప్టర్లు 1-24 కిందకు వచ్చే ఎగుమతి ఉత్పత్తులకు వర్తించవని డీజీఎఫ్టీఈ స్పష్టం చేసింది. ఈ చాప్టర్లలో ప్రధానంగా వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. ఆర్ఓడీటీఈపీ పథకానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.18,232 కోట్లు కేటాయించగా, 2026-27 సంవత్సరానికి రూ.21,709 కోట్లకు పెంచాలనే ప్రతిపాదన ఉండేది. అయితే తాజా బడ్జెట్లో ఈ పథకానికి రూ.10,000 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం.




















.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!