

ఇటీవలి కాలంలో ఆల్టైమ్ గరిష్టాలకు చేరుకున్న బంగారం, వెండి ధరలు ఇప్పుడు భారీగా పతనమవుతున్నాయి. గత నాలుగు నుంచి ఐదు రోజులుగా ధరలు నిరంతరంగా తగ్గుతుండటంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతుండగా, కొనుగోలుదారులకు మాత్రం ఇది ఊరట కలిగించే పరిణామంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు లాభాల స్వీకరణ పెరగడం వల్లే బులియన్ మార్కెట్లో ఈ స్థాయి పతనం చోటుచేసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ నెల 2 ఉదయం 9:30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,530 కు చేరింది. నిన్నటితో పోలిస్తే రూ.9,050 తగ్గుదల నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,900 గా ఉండగా, ఇది రూ.8,300 తగ్గింది. మరోవైపు వెండి ధరలు మరింత భారీగా క్షీణించాయి. ఐదు రోజుల క్రితం రూ.4.25 లక్షలకు చేరిన కిలో వెండి ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లలో రూ.3 లక్షలకు పడిపోయింది. ఒక్కరోజులోనే కిలో వెండిపై సుమారు రూ.50 వేల మేర తగ్గుదల కనిపించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!